: నాగాలాండ్ లో కిడ్నాపర్ల చెర నుంచి తెలుగు ఇంజినీర్లకు విముక్తి


అపహరణకు గురైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్లకు కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి కలిగింది. తాము విడుదలైనట్లు వారు బంధువులకు సమాచారం అందించారు. రత్న కన్ స్ట్రక్షన్స్ కంపెనీలో పని చేస్తున్న గోగినేని ప్రతీశ్ చంద్ర, రఘు రెండు రోజుల కిందట నాగ్ లాండ్ లోని దిమ్మాపూర్ లో కిడ్నాపునకు గురైనట్లు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈరోజు (మంగళవారం) మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో, కిడ్నాపర్లతో కంపెనీ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మరో గంటలో వారు సురక్షిత ప్రాంతానికి చేరుకోనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News