: సహరాన్ పూర్ లో రంజాన్ ప్రార్థనలు ప్రశాంతం


ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పండుగ) ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ఇటీవల సహరాన్ పూర్ మత ఘర్షణలతో అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన కర్ఫ్యూను రంజాన్ ప్రార్థనల సందర్భంగా సడలించారు. ఈద్ ప్రార్థనల్లో సుమారు 50 వేల మంది వరకు పాల్గొన్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈద్గా మైదానంలో ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ... పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News