: మోడీకి విమానాశ్రయంలో స్వయంగా స్వాగతం పలకనున్న నేపాల్ ప్రధాని


రెండు రోజుల విదేశీ పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 4న నేపాల్ కు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల ప్రొటొకాల్ ను పక్కన పెట్టి మరీ ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి స్వయంగా మోడీకి స్వాగతం పలకనున్నారట. ఆయనతో పాటు పలువురు సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రత్యేకంగా స్వాగతం చెప్పనున్నారని కొయిరాల విదేశీ వ్యవహారాల సలహాదారు దినేష్ భట్టారాయ్ తెలిపారు. మోడీ పర్యటనకు నేపాల్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో దీనిని బట్టి తెలుస్తోంది.

  • Loading...

More Telugu News