: రాజధాని కోసం ప్రతి జిల్లాలోనూ అన్వేషిస్తున్నాం: నారాయణ


రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ పలు విషయాలు ప్రస్తావించారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. శ్రీకాకుళం నుంచి గుంటూరుకు 660 కి.మీ. దూరం ఉంటుందని ఆయన చెప్పారు. రాజధాని ఏర్పాటుపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ మరికొన్ని జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజమండ్రి, కాకినాడతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో తాము పర్యటించి... ఆ జిల్లాలో ఎంత భూమి ఉందన్న వివరాలను సేకరిస్తామని ఆయన చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి ఉన్న ప్రాంతం రాజధానికి అనువైనదని నారాయణ అన్నారు. రాజధాని కోసం 25 వేల ఎకరాలు ఉన్న ప్రాంతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉందని, అయినా అత్యుత్తమ రాజధాని కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News