: నాలుగో టెస్టుకు కూడా ఇషాంత్ శర్మ డౌటే


కాలిగాయం కారణంగా ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ కు హఠాత్తుగా దూరమైన పేసర్ ఇషాంత్ శర్మ... నాలుగోటెస్ట్ ఆడటంపై కూడా సందేహాలు ముసురుకున్నాయి. భారత కోచ్ జోడేవ్స్ మాటల్లో వ్యక్తమవుతున్న ఆందోళన చూస్తే మాత్రం ఇషాంత్ నాలుగో టెస్ట్ ఆడటం కూడా అనుమానంగానే ఉంది. గాయంతో బాధపడుతున్న ఇషాంత్‌ శర్మ ఫిట్ నెస్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని భారత బౌలింగ్ కోచ్ జోడేవ్స్ అన్నాడు. ఇషాంత్ కాలిగాయంపై ఓ అంచనాకు రావడానికి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయని జోడేవ్స్ వ్యాఖ్యానించాడు. నాలుగోటెస్టుకు ఇంకా 11 రోజుల సమయం ఉంది కాబట్టి... గాయం తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని జోడేవ్స్ అన్నాడు.

  • Loading...

More Telugu News