: స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు
రంజాన్ పర్వదినం సందర్భంగా ఇండో పాక్ సరిహద్దుల్లో పండుగ వాతావరణం నెలకొంది. చేతిలో ఆయుధాలతో అనుక్షణం అలర్ట్ గా ఉండే సైనికులు... తుపాకీలను పక్కనపెట్టి స్వీట్ ప్యాకెట్లను చేతిలోకి తీసుకున్నారు. వాఘా సరిహద్దులో ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుని... శుభాకాంక్షలు తెలుపుకున్నారు.