: 'ఆపరేషన్ మజ్ను'... లైంగిక నేరగాళ్ళకు చుక్కలు చూపిస్తారు!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లైంగిక దాడులకు పాల్పడే వాళ్ళకు చుక్కలు చూపిస్తామంటున్నారు అక్కడి పోలీసులు. ఈ మేరకు వారు 'ఆపరేషన్ మజ్ను' పేరిట సరికొత్త కార్యాచరణకు తెరదీశారు. శనివారం ఈ ఆపరేషన్ ప్రారంభించగా, 12 మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. లైంగిక నేరగాళ్ళకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, ఇలాంటి నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో తాము అకస్మాత్తుగా దాడులు నిర్వహిస్తామని మధ్యప్రదేశ్ పోలీసు అధికారులు తెలిపారు.