: మాసాయిపేట స్కూల్ బస్సు ఘటనపై కోర్టులో పిల్


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘోర ప్రమాదంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఘటనపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని అందులో కోరారు. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదం సంభవించిందంటూ హైదరాబాదుకు చెందిన బి.మోహన్ రావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ, రైల్వేశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను పిల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News