: మోండా మార్కెట్ లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్ లోని ఓ ప్లాస్టిక్ దుకాణంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మార్కెట్ పరిసరాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. రెండు గంటల పాటు నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.