: సింగపూర్ నుంచి కేసీఆర్ కు ఆహ్వానం అందింది
సింగపూర్ రమ్మంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్)కు ఆహ్వానం అందింది. ఆగస్టు 22, 23 తేదీల్లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సుకు హాజరుకావాలంటూ... కేసీఆర్ ను ఆహ్వానించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో కేసీఆర్... సింగపూర్ సింగిల్ విండో విధానాన్ని పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే, దీనికి సంబంధించి సింగపూర్ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరుపుతారు.