: విమానం చక్రాలకి మంటలంటుకున్నాయి
విమాన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలంత సులభంగా చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన బిజి 702 విమానం నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా వెనుక టైర్లకు నిప్పంటుకుంది. వెంటనే పైలట్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించేశారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి ఢాకా వెళ్లాల్సిన ఆ సర్వీసు రద్దైంది. బంగ్లాదేశ్ నుంచి ఖాట్మండు చేరుకున్న నిపుణులు ఈ విమానానికి మరమ్మతులు చేపట్టారు.