: టీడీపీలో చేరిన మరో విద్యాసంస్థల అధినేత


టీడీపీలో విద్యాసంస్థల అధినేతలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేసి, కేజీ నుంచి పీజీ వరకు బ్రిటన్, అమెరికా స్థాయిలో ప్రభుత్వాధీనంలో ఉచిత విద్యను అందజేస్తానని ప్రకటించడంతో విద్యాసంస్థల అధినేతలు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా తాజాగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పటికే నారాయణ సంస్థల అధినేత నారాయణ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి విదితమే. తాజాగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత టీడీపీతో చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News