: చిన్నారి పాలిట శాపమైన నైలాన్ తాడు
చిన్నారి పాలిట నైలాన్ తాడు మృత్యు పాశమైంది. తాను ఆడుకుంటున్న నైలాన్ తాడు మెడకు చుట్టుకుపోవడంతో 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన తమిళనాడులోని మధురైలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో చోటు చేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమారుడు దక్షిణాబాలన్ తన తమ్ముడితో కలిసి తాడుతో ఆట ఆడుతుండగా... అనుకోకుండా మెడకు చుట్టుకుపోయింది. అయితే మెడకు చుట్టుకున్న తాడును తొలగించడం తమ్ముడికి వీలుకాలేదు. ఈ గందరగోళంలో మెడకు తాడు మరింత బిగుసుకుపోయింది. దీంతో బాలుడు ప్రాణాలు విడిచినట్టు పోలీసులు తెలిపారు.