: కల్తీ కల్లు తాగి... ఆసుపత్రి పాలైన 10 మంది


కర్నూలు జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్తీ కల్లు తాగడం వల్లనే వారు అస్వస్థతకు గురయ్యారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లు వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి... కల్లులో మత్తును కలిగించేందుకు రసాయనాలు కలపడంతో పలు సందర్భాల్లో కల్తీ కల్లు తాగి ఆరోగ్యం చెడిపోతోంది. దీనిపై ఫిర్యాదులు వస్తున్నా అబ్కారీ శాఖాధికారులు పట్టించుకోవడం లేదనే వాదన వినవస్తోంది.

  • Loading...

More Telugu News