: జైలర్ తగలెట్టేశాడు... మరణిస్తూ ఖైదీ వాంగ్మూలం
బీహార్ జైల్లో ఘోరం చోటుచేసుకుంది. విచారణ ఖైదీని జైలర్ పొట్టనబెట్టుకున్నాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తి ఆయుధాల చట్టం కింద నాలుగేళ్లుగా నెవెడా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. రూపేష్ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని పేర్కొంటూ 80 శాతం కాలిన గాయాలతో పాట్నా వైద్య కళాశాల ఆసుపత్రికి జైలు సిబ్బంది తరలించారు. రూపేష్ పాశ్వాన్ మరణించే ముందు మెజిస్ట్రేటుకు ఇచ్చిన వాంగ్మూలంలో... జైలులో నాణ్యమైన భోజనం పెట్టాలని గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నందుకు ప్రతీకారంగా జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మ యాదవ్ తనపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు చెప్పి మరణించాడు.