: నా జీవితంలో పెళ్లే చేసుకోను: సల్మాన్ ఖాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పెళ్లికోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ మాట నిరాశే కలిగిస్తుంది. సల్లూభాయ్ ఇంతకాలం వివాహం చేసుకుంటాడని భావిస్తున్న అందరికీ పెద్ద షాక్. ఇక తన జీవితంలో పెళ్లే చేసుకోనని ఓ టీవీ షో ఇంటర్వ్యూలో సల్మాన్ స్పష్టం చేశాడు. అంతేకాక రాజకీయాలు, సినిమా దర్శకత్వం పైన తనకు ఆసక్తి లేదని సల్లూ వెల్లడించాడు.