: కర్నూలు జిల్లాలో సునీల్ హల్ చల్
టాలీవుడ్ నటుడు సునీల్ కర్నూలు జిల్లాలో హల్ చల్ చేశారు. కోవెలకుంట్ల మండలం గుళ్ళదుర్తిలో హోమియో పితామహుడు హానిమన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు పువ్వులు విరబూయించారు. తనదైన శైలిలో జోకులు పేల్చి ప్రజలకు ఆహ్లాదం కలిగించారు. 'కోనసీమ వాసులకు కంగారెక్కువ, రాయలసీమ వాసులకు ధైర్యమెక్కువ' అంటూ వ్యాఖ్యానించి స్థానికులను ఉత్సాహపరిచారు. సినిమాల్లోకి రాకముందు ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేశానని, అక్కడ తొలి పది టోకెన్లను అట్టిపెట్టి, ఎవరైనా వృద్ధులు వస్తే ఇచ్చేవాణ్ణని తెలిపారు. వృద్ధులకు వైద్యం త్వరగా అందాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు.