: సివిల్స్ వివాదాన్ని వారంలోగా పరిష్కరిస్తాం: రాజ్ నాథ్
సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీ అభ్యర్థులు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫార్మాట్ వల్ల ఇంగ్లిష్ మాట్లాడలేని అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వీరు వాపోతున్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ వివాదాన్ని వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు.