: మూడేళ్లలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాం: టీఎస్ మంత్రి పోచారం


తెలంగాణలో 20 లక్షల పంపుసెట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల పంపుసెట్లు మాత్రమే ఉన్నాయని... అయినా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకున్నారని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్రుల పాలనలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ ఉంటేనే పంటలు పండుతాయని... లేకపోతే రైతన్నలు ఆకలితో అలమటించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ప్రారంభించారని చెప్పారు. మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం పనులను ప్రారంభించిందని తెలిపారు. రానున్న మూడేళ్లలో రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తామని... ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News