: తెగబడిన బోకోహరామ్ మిలిటెంట్లు... ఉప ప్రధాని భార్య కిడ్నాప్


బోకోహరామ్ తీవ్రవాద సంస్థ ఆగడాలకు హద్దుల్లేకుండా పోయాయి. మొన్నటికిమొన్న 200 మంది బాలికలను ఎత్తుకెళ్ళిన ఈ నైజీరియా ఉగ్రవాద మూక తాజాగా కామెరూన్ ఉప ప్రధాని భార్యను కిడ్నాప్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. కామెరూన్ దక్షిణ ప్రాంతంలోని కోలోఫతా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ సందర్భంగా మిలిటెంట్లు ముగ్గురిని కాల్చిచంపారు. ఉప ప్రధాని భార్యనే కాకుండా, నగర మేయర్ సీనీ బౌకర్ లామినేను కూడా కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలో, కామెరూన్ దళాలు విస్తృత గాలింపు చేపట్టాయి. గత కొన్ని వారాలుగా ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపు బోకో హరామ్ సరిహద్దులు దాటి వచ్చి మరీ కామెరూన్ లో దాడులు చేస్తుండడం గమనార్హం.

  • Loading...

More Telugu News