: ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో ఘర్షణ... తలలు పగులగొట్టుకున్న కేఈ, కోట్ల వర్గీయులు
కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల గ్రామం ఫ్యాక్షన్ కు మారుపేరు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఫ్యాక్షన్ కొనసాగుతోంది. వర్గాల ఆధిపత్య పోరులో ఎంతోమంది అసువులుబాసారు. ఈ ఊరిలో గోటితో పోయే సమస్య కూడా గొడ్డలి వరకు వస్తుంటుంది. అలాంటి కప్పట్రాళ్లలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. కోట్ల, కేఈ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కుళాయి పైపుల తొలగింపు విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.