: బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తాళాలేసిన గ్రామస్థులు


బీఎస్ఎన్ఎల్ సేవల తీరుతో విసిగిపోయిన గ్రామస్థులు కార్యాలయానికి తాళాలేశారు. ప్రైవేటు నెట్ వర్క్ సంస్థలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే బీఎస్ఎన్ఎల్ తీరు మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ నాసిరకంగా ఉండడంతో తీవ్ర విమర్శలపాలవుతోంది. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో గత వారం రోజులుగా బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోయాయి. దీనిపై గ్రామస్ధులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు... వినతి పత్రాలిచ్చారు. అయినప్పటికీ సేవలు పునరుద్ధరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News