: అక్కసు వెళ్ళగక్కిన కేపీ
ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ కు, స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కెరీర్లోనే అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు కుక్. దీంతో, కేపీ ఇదే అదనుగా విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లో రాజకీయాల వల్లే కుక్ ఇంకా కెప్టెన్ గా కొనసాగుతున్నాడని ఆరోపించాడు. కుక్ బుర్రలో ఏమీ లేదన్న విషయం తేలిపోయిందని, ఇక అతడు పదవి నుంచి వైదొలగడం మంచిదని సూచించాడు.