: కమలనాథన్ కమిటీ వైఖరిని వ్యతిరేకిస్తున్నాం: టీఎన్జీవోలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఏర్పాటైన కమలనాథన్ కమిటీతో ఇవాళ (శనివారం) టీఎన్జీవో నేతలు సమావేశమయ్యారు. భేటీ అనంతరం టీఎన్జీవో నేతలు మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనలో కమిటీ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. విభజన ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండాలని వారు డిమాండ్ చేశారు. అక్టోబరు 31 నాటికి ఉద్యోగుల విభజన పూర్తి చేయాలన్నారు. భార్యాభర్తలు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారైతే... ఇక్కడే పనిచేసేందుకు వీలు కల్పించాలని వారు కోరారు. తెలంగాణలో ఉన్నవారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News