: ఏపీ రాజధానిపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాజధానిపై సీఎంకు కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. వీజీటీఎం పరిధిలో తక్షణ రాజధాని ఏర్పాటుకు అవకాశం ఉందని, దీనివల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్పింది. అయితే, దీని పరిధిలో భూ లభ్యత తక్కువగా ఉంటుందని, పరిమితమైన రాజధాని నిర్మాణానికే అనుకూలత ఉందని తెలిపింది. కాగా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాల డెవలప్ మెంట్ కోసం విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీజీటీఎం) ఏర్పాటు చేశారు.