: తల్లిదండ్రులు వస్తున్నారని ప్రియుణ్ణి వార్డ్ రోబ్ లో దాచింది!
'ఇంట్లో ఎవరూ లేరు, ఎంజాయ్ చేద్దాం రా' అంటూ ప్రియుణ్ణి పిలిచిన ఆ యువతికి చుక్కెదురైంది. చెప్పిన సమయం కంటే కాస్త ముందే ఊడిపడ్డారామె తల్లిదండ్రులు. దీంతో ప్రియుణ్ణి వార్డ్ రోబ్ లో దాచేసింది. కాసేపు ఎలాగో నెట్టుకొచ్చిన అతగాడు, కాలం గడిచేకొద్దీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. 'ఎంతసేపు ఇలా' అంటూ ప్రేయసికి ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపాడు. ఫలితం లేకపోవడంతో, వెంటనే వార్డ్ రోబ్ లోంచి దభీమని దూకేశాడు. ఈ అనుకోని అతిథిని చూసి ఆ యువతి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తేరుకుని అతగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది. స్మిత, రాహుల్ ప్రేమికులు. ఓ రోజు స్మిత తల్లిదండ్రులు ఊరెళ్ళారు. దీంతో, సాయంత్రం వరకు ఊసులాడుకోవచ్చని స్మిత, రాహుల్ కు కాల్ చేసింది. ఈ క్రమంలోనే సీన్ అడ్డం తిరిగింది. తల్లిదండ్రులు ఓ రోజు ముందుగానే రావడం, రాహుల్ దొరికిపోవడం జరిగాయి. తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ స్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాహుల్ ను ఇదే విషయమై ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.