: ఖాళీ గిన్నెలు, ప్లకార్డులతో కోదండరామ్ కు నిరసన
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కు ఓయూ విద్యార్థుల నుంచి వినూత్నరీతిలో నిరసన వ్యక్తమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు పోలవరంపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు కోదండరామ్, ఇతరులు వచ్చారు. అక్కడ రహదారిపై వారిని అడ్డుకున్న విద్యార్థులు బైఠాయించి ఖాళీ గిన్నెలతో భిన్నంగా నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్లకార్డులతో తమ ఆందోళనను వ్యక్తం చేశారు.