: చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు యత్నం... పరిస్థితి ఉద్రిక్తం, 144 సెక్షన్ విధింపు


చంద్రబాబు దిష్టిబొమ్మను తగులబెట్టేందుకు వైకాపా శ్రేణులు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా కొల్లూరులో రైతులతో కలసి టీడీపీ నేతలు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. దీనిని నిరసిస్తూ వైకాపా నేతలు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో, ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు కొల్లూరులో 144 సెక్షన్ విధించారు.

  • Loading...

More Telugu News