: తెలంగాణ డీజీపీ కార్యాలయానికి 'కరెంట్ కట్'!


సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ కే 'కరెంట్ షాక్' తగిలింది. విద్యుత్ బిల్లు బకాయిలు చెల్లించనందుకు ఏకంగా తెలంగాణ డీజీపీ కార్యాలయానికే విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. మాములు పోలీస్ స్టేషన్ కు పవర్ కట్ చేయాలంటేనే ఒకటికి వంద సార్లు ఆలోచించే అధికారులు ఏకంగా డీజీపీ ఆఫీస్ కే కరెంట్ సరఫరాను నిలిపివేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలోని శాంతిభద్రతలకు, రక్షణకు ఆయువుపట్టు లాంటి డీజీపీ ఆఫీస్ గత రెండు రోజులుగా చీకట్లో నడుస్తోంది. విద్యుత్ బిల్లులు చెల్లించని కారణంగా గురువారం ఉదయం డీజీపీ కార్యాలయానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో డీజీపీ కార్యాలయ ఉద్యోగులు తాత్కాలికంగా ఫ్యూజ్ బాక్సుల్లో వైర్లు బిగించి కరెంట్ సరఫరాను పునరుద్ధరించుకున్నారు. అయితే, విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు డీజీపీ కార్యాలయానికి సరఫరా అయ్యే కరెంట్ వైర్ ను ఎలాంటి మొహమాటం లేకుండా కట్ చేశారు. తెలంగాణ డీజీపీ కార్యాలయం రూ.2లక్షల పైగా బాకీ ఉందని... ఈ బిల్లులు చెల్లించాలని చాలాకాలం క్రితమే నోటీసులు పంపించామని, అయినా ఎటువంటి స్పందన లేకపోవడంతో... ఉన్నతాధికారుల ఆదేశం మేరకే డీజీపీ ఆఫీస్ కు విద్యుత్ కట్ చేశామని విద్యుత్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News