: నరకాసుర వధపై తొందరపడ్డామా...?: వైసీపీ శ్రేణుల అంతర్మథనం
నరకాసురవధ కార్యక్రమంపై వైసీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. వ్యవసాయ, డ్వాక్రా రుణ మాఫీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే, దీనికి రైతులతో పాటు వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఆశించనంత స్పందన రావడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకుండానే... ఇలాంటి ఆందోళనలు చేపట్టడం వ్యూహాత్మక తప్పిదమని వారు అభిప్రాయపడుతున్నారు. నరకాసురవధ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన జగన్... ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తాడని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే ఆ తర్వాత జగన్ కేవలం లోటస్ పాండ్ కే పరిమితమవడం వైసీపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఆశించినంత స్పందన లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎలా ముందుకుతీసుకువెళ్లాలా? అని వైసీపీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.