: రేపు రాష్ట్రపతి రాయ్ పూర్ కి వస్తున్నారు
శనివారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఛత్తీస్ గడ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో పర్యటించనున్నారు. రవిశంకర్ శుక్లా యూనివర్శిటీలో జరిగే గోల్డెన్ జూబ్లీ స్నాతకోత్సవంలో ప్రణబ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా వర్శిటీ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఈ పర్యటన వివరాలను పేర్కొన్నారు.