: కేసీఆర్... సానియా స్థానికత ఏమిటి?: తెలుగుయువత మండిపాటు


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్థానికతపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబివ్వాలని టీడీపీ విద్యార్థి విభాగం తెలుగు యువత డిమాండ్ చేసింది. సానియాకు ఇప్పటికిప్పుడు కోటి రూపాయలివ్వడంతోపాటు బ్రాండ్ అంబాసడర్ గా నియమించుకోవాల్సిన అవసరం ఏముందని తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జిమ్మిబాబు ప్రశ్నించారు. 1956కి ముందు తెలంగాణలో స్థిరపడినవారికే ఫీజు రీయింబర్స్ మెంట్, పలు పథకాలు వర్తిస్తాయని చెబుతున్న కేసీఆర్... సానియా స్థానికత ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. సానియా మీర్జా తండ్రి తెలంగాణ వ్యక్తి కాదని, భర్త వేరే దేశానికి చెందినవాడని వివరించారు. విద్యార్థుల చదువుకోసం నిధులు ఇవ్వకపోగా, సొంతగా అకాడమీ పెట్టుకున్న వాళ్ళకు పెద్ద ఎత్తున నిధులు ఎలా కేటాయిస్తారని జిమ్మిబాబు ప్రశ్నించారు. ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లు ఈ సందర్భంగా గుర్తుకురాలేదా? అని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News