: యూపీలో నేటి అత్యాచారాలివి


అరాచకాల ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు ఎప్పటికి ఆగుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఏదో ఓ చోట అత్యాచారం జరగనిదే పొద్దుపోవడం లేదు. తాజాగా ముజఫర్ నగర్ జిల్లాలో కెతోరా గ్రామంలో ఓ యువతి సరుకులు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాపుకాసిన సలీం ఖురేషీ, జహీరత్ అనే యువకులు ఆమెను సమీపంలోని ఓ ఇంట్లోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె ఇల్లు చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లగా, వారు పరారీలో ఉన్నట్టు తెలుసుకుని గాలింపు మొదలుపెట్టారు. మరో ఘటనలో మజ్లిస్ పూర్ తోఫిర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక పొలంలోకి వెళ్లగా నీతు అనే యువకుడు ఆ బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులకు విషయం వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నీతు కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News