: లోక్ సభలో ఆర్థిక బిల్లు పాస్
2014 ఆర్థిక బిల్లు లోక్ సభలో ఇవాళ పాస్ అయ్యింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లును ఆమోదించిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎంపీల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రజల మీద భారం వేయకుండా ఉండేందుకు తాము ప్రయత్నించామని జైట్లీ చెప్పారు. తమ ప్రభుత్వం పన్నులు ఎక్కువగా విధించదని, అది అభివృద్ధికి ఆటంకమని ఆయన అన్నారు. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆర్థిక మంత్రి అన్నారు. మార్కెట్లో దేశీయ ఉత్పత్తుల్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తద్వారా ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అరుణ్ జైట్లీ అన్నారు.