: శనివారం నాడు చంద్రబాబుతో సమావేశమవుతోన్న శివరామకృష్ణన్ కమిటీ
శనివారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ సమావేశమవుతోంది. రాజధాని ఏర్పాటు అంశానికి సంబంధించి ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన మూడు నెలల్లో రాజధాని కోసం స్థలాన్ని గుర్తిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. రేపు ఉదయం 9 గంటలకు రాష్ట్ర సచివాలయంలో రాజధాని సలహా కమిటీ సమావేశమవుతుందని ఆయన తెలిపారు.