: హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తా: చంద్రబాబు


అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగపర్చుకుంటూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురం పట్టణంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, రైతులను రుణాల నుంచి విముక్తులను చేసేందుకే రుణమాఫీ ప్రకటించామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదేనని బాబు పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News