: యూపీ రోడ్లపై మహిళలకు రక్షణ లేదు: గోవా సీఎం
ఉత్తరప్రదేశ్ లో యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉత్తరప్రదేశ్ రోడ్లపై స్త్రీలకు రక్షణ లేదన్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత వారు బయటికి వెళితే మాయమవుతున్నారని అన్నారు. "గోవా వీధుల్లో ఏ యువతి అయినా భయం లేకుండా వెళ్లగలదు. కానీ, ఉత్తరప్రదేశ్ లో ఆరు తర్వాత వెళితే కనిపించదు" అని గోవా అసెంబ్లీలో పారికర్ పేర్కొన్నారు. కాగా, వాళ్ళ ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కొన్ని రాష్ట్రాలు గోవాను విమర్శించే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం ఆరోపించారు.