: ఆనాటి బహుమతి కోసం సైనా ఎదురుచూపులు
భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించడం వరకు బాగానే ఉంది. అప్పుడామెకు రూ.50 లక్షల నగదు బహుమతి ప్రకటించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు. ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది. మరి సైనా బహుమతి మొత్తం ఎవరు చెల్లించాలి? సైనా కూడా ఇదే ప్రశ్న అడుగుతోంది. ఇప్పటికీ ఆనాటి బహుమతి అందకపోవడం తనను నిరాశకు గురిచేస్తోందని తెలిపింది. అసలు దాని గురించి ఎవరిని అడగాలో తెలియడంలేదని ట్విట్టర్లో వాపోయింది.