: ప్రముఖ రచయిత చేకూరి రామారావు (చేరా) ఇక లేరు
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు సాహితీ విమర్శకులు, రచయిత చేకూరి రామారావు (చేరా) కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆధునిక భాషా శాస్త్రంలో చేరా కొత్త పంథాను సృష్టించారు. తెలుగు సాహితీ విమర్శలో నూతన ఒరవడికి ఆయన నాంది పలికారు. ఆయన చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. కార్నెల్ యూనివర్శిటీ నుంచి ఆయన డాక్టరేట్ పొందారు.