: హెచ్ఐవీ రోగుల కోసం హైదరాబాద్ లో ఆశ్రమం


హైదరాబాద్ నగరంలో హెచ్ఐవీ బాధితుల కోసం ప్రత్యేక ఆశ్రమం నెలకొల్పనున్నామని జగద్గురు సన్యాస ఆశ్రమం అధిపతి, శంకర ట్రస్ట్ నిర్వాహకులు స్వామి అభిషేక్ చైతన్యగిరి తెలిపారు. హెచ్ఐవీ పేషెంట్లు సమాజంలో నిరాదరణకు గురవుతూ... చివరి రోజుల్లో కుమిలిపోతూ దీనంగా చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి జీవితాల్లో కొత్త వెలుగును నింపేందుకు తాము ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఓ ఆశ్రమాన్ని నెలకొల్పనున్నట్టు అభిషేక్ చైతన్యగిరి ప్రకటించారు. రుషికేష్ లో తమకు ఓ ఆశ్రమం ఉందని... ఆ ఆశ్రమంలో ఎంతోమంది విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నామని చైతన్యానంద గిరి తెలిపారు. గత ఏడాది ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు తాము ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కూడా తమకు ఆశ్రమాలు ఉన్నాయని... వీటి ద్వారా యోగా, భారతీయ వైద్య విజ్ఞానాన్ని విదేశీయులకు అందజేస్తూ... సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News