: అజ్ఞాతంలో స్కూల్ యజమాని... ఫోన్లు స్విచ్చాఫ్


మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే గేటు వద్ద దుర్ఘటన జరిగిన అనంతరం కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. మరో వైపు తుప్రాన్‌ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ప్రమాద ఘటనపై మౌనం వహిస్తోంది. స్కూల్ కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్‌ చేసి ఉన్నాయి. కాకతీయ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే ప్రమాదంతో తమకు సంబంధం లేదని సమాధానం వస్తోంది. కాకతీయ గ్రూప్ వెబ్ సైట్లో తుప్రాన్‌ బ్రాంచ్‌ ను ఫ్రాంచైజ్‌ స్కూల్‌గా పేర్కొంది.

  • Loading...

More Telugu News