: రోజుకు ఆరు గంటలు బయటకు వెళ్లేందుకు సుబ్రతారాయ్ కు అనుమతి


సహారా గ్రూపు సంస్థల అధినేత సుబ్రతారాయ్ రోజుకు ఆరు గంటల పాటు బయటకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆ సమయంలో పోలీసుల కస్టడీలో ఉండి తన ఆస్తుల అమ్మకానికి సంబంధించి కొనుగోలుదారులతో చర్చలు జరపవచ్చని తెలిపింది. అటు సెబీకు ఇవ్వాల్సిన పది వేల కోట్లు చెల్లిస్తేగానీ బెయిల్ ఇచ్చేదిలేదని పలుమార్లు సుప్రీం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆస్తులను న్యూయార్క్, లండన్ లో తాకట్టుపెట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. అందుకుగానూ ప్రతిరోజు ఆయన తీహార్ జైలు నుంచి బయటికి వెళతారు.

  • Loading...

More Telugu News