: కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవానికి సచిన్
గ్లాస్గోలో నేడు కామన్వెల్త్ క్రీడలు ఆరంభం కానున్నాయి. ఈ వేడుకలకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ హాజరు అవుతున్నాడు. క్రికెటే కాకుండా సచిన్... టెన్నిస్, సాకర్, ఫార్ములా వన్ రేసింగ్ అన్నా విపరీతమైన అభిమానం చూపిస్తాడు. ఈ క్రమంలో నిర్వాహకులు ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిందిగా సచిన్ కు ఆహ్వానం పంపారు. అందుకు సచిన్ అంగీకారం తెలిపారు. కాగా, ఈ క్రీడల్లో భారత జట్టు విషయానికి వస్తే గత రికార్డు మెరుగుపరచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో మనవాళ్ళు 110 పతకాలతో ఆస్ట్రేలియా తర్వాత రెండో స్థానంలో నిలిచారు.