: సర్వీసుల నుంచి కళంకిత ఐఏఎస్ జంట తొలగింపు


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధ్యప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు అరవింద్ జోషి, టిను జోషిలను ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. దానికి సంబంధించి వారికి ఆదేశాలు కూడా జారీచేసినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన ఈ దంపతులిద్దరూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో, 2010లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సమయంలో మూడు కోట్ల నగదుతో కలిపి రూ.350 కోట్ల ఆస్తులను అధికారులు కనుగొన్నారు.

  • Loading...

More Telugu News