: మలేసియా విమాన ప్రమాదం: పుతిన్ కు కుమార్తెను కోల్పోయిన డచ్ ఫాదర్ కృతజ్ఞతలు


మలేసియా విమానం ఎంహెచ్17 కూలిన ప్రమాదంలో డచ్ కు చెందిన ఓ తండ్రి తన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయాడు. అందుకు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అతను వింతగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు తండ్రి హన్స్ డి బోర్స్ట్ ఓ బహిరంగ లేఖ రాశాడు. "నా ముద్దుల కూతురు ఎల్స్ మిక్ (17)ను చంపిన పుతిన్, వేర్పాటువాద నాయకులు లేదా ఉక్రెయిన్ గవర్నమెంట్ కు చాలా కృతజ్ఞతలు. హఠాత్తుగా ఆమె చనిపోయింది. ఓ విదేశం చేసిన యుద్ధం వల్ల ఆకాశంలోనే విమానాన్ని కాల్చేశారు. వచ్చే ఏడాదిలో తన స్నేహితురాలు జూలియాతో నా కుమార్తె పాఠశాల విద్యను పూర్తి చేయనుంది. తర్వాత డెల్ఫ్ విశ్వవిద్యాలయంలో ఆమె సివిల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంది. అందుకు బాగా ఎక్సైట్ అయింది. కానీ, తన యంగ్ లైఫ్ ను నాశనం చేసినందుకు మీరు గర్వపడుతున్నారని అనుకుంటున్నాను. ఈ సందేశాన్ని త్వరలో మీరు (పుతిన్) తప్పక చదువుతారని, లేదా మీ సహాయకులు మీకు చెబుతారని అనుకుంటున్నా" అంటూ వ్యంగ్యంగా ఆ తండ్రి తన ఆవేదనను వెల్లడించాడు. ఈ లేఖను డచ్ మీడియా ప్రచురించింది.

  • Loading...

More Telugu News