: తొమ్మిది మంది మావోయిస్టుల కాల్చివేత
మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. రాష్ట్ర సరిహద్దులలో ఛత్తీస్ గఢ్ లో గ్రేహౌండ్స్, సీఆర్సీఎఫ్ దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారం ఆధారంగా కూంబింగ్ కు వెళ్లిన పోలీసు దళాలకు వారు తారసపడినప్పుడు కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన ప్రాంతం ఖమ్మంజిల్లా సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం.