: ఈ రోజు ట్విట్టర్ హీరో ఇషాంత్
28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లార్డ్స్ లో భారత కీర్తపతాకను ఎగురవేసిన ఇషాంత్ శర్మ ట్విట్టర్ ను ఆక్రమించాడు. భారత జట్టు లార్డ్స్ లో విజయం సాధించిన తరువాత 7 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాంత్ శర్మపై ట్విట్టర్లో అభినందనల వర్షం కురిసింది. ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని ఇషాంత్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో ట్విట్టర్ ట్రెండ్స్ లో ఇషాంత్ పేరు ప్రముఖంగా నిలిచింది. ఫేస్ బుక్ లో కూడా ఇషాంత్ శర్మపై అభినందనలు వెల్లువెత్తాయి. ఫాం కోల్పోయి, గాయాలపాలై అంతర్జాతీయ క్రికెట్ కు కొంత కాలం దూరమైన ఇషాంత్ చాలా రోజులకు భారతీయులు గర్వించే ప్రదర్శన చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.