: లార్డ్స్ లో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా


టీమిండియా లార్డ్స్ లో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగారు. తొలి ఇన్నింగ్స్ లో భువనేశ్వర్ కుమార్ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ నడ్డి విరిస్తే, రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ను వణికించాడు. దీంతో భారత జట్టు చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. తొలి టెస్టులో టెయిలెండర్ల సాహసోపేత బ్యాటింగ్ తో ఓటమినుంచి బయటపడ్డ ఇంగ్లీష్ జట్టు రెండో టెస్టులో మాత్రం భారత జట్టు జోరును అడ్డుకోలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కుక్ నిర్ణయాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాను కట్టడి చేశారు. దీంతో కేవలం 295 పరుగులే చేయగలిగిన భారత జట్టు ఒత్తిడిలో పడింది. భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 319 పరుగులు చేసి భారత్ పై ఆధిక్యత సంపాదించింది. తొలి ఇన్నింగ్స్ గుణపాఠంతో టీమిండియా జాగ్రత్తగా ఆడి 342 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను ఇషాంత్ శర్మ కట్టిపడేశాడు. ఇషాంత్ విజ్రుంభణతో 223 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ కేవలం 74 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడంతో భారత జట్టు 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో భారత జట్టు విజయం సాధించగా, 14 టెస్టుల తరువాత టీమిండియా విదేశాల్లో విజయం సాధించింది. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యం సంపాదించింది.

  • Loading...

More Telugu News