: మాజీ పీఎం మన్మోహన్ సింగ్ సలహాదారును ప్రశ్నించనున్న సీబీఐ
బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహాదారు టీకేఏ నాయర్ ను సీబీఐ త్వరలో ప్రశ్నించనుంది. ఈ స్కాంలో హిందాల్కో ఛైర్మన్ కుమార మంగళం బిర్లాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై అధికారులు విచారించనున్నారు. అయితే, మార్చిలోనూ నాయర్ ను సీబీఐ కొన్ని అంశాలపై విచారించింది. 1993 నుంచి 2005 వరకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ఇప్పటివరకు ఇరవై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.