: సీనియర్ ఎంపీల కన్నా జూనియర్ ఎంపీలే బెటర్


లోక్ సభలో సీనియర్ ఎంపీలపై జూనియర్ ఎంపీలదే పైచేయిగా నిలిచింది. మొదటిసారి పార్లమెంట్ కు ఎన్నికైన కొత్త ఎంపీలు పాత ఎంపీల కన్నా ఉత్సాహంగా చురుగ్గా చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుత లోక్ సభలో 315 మంది ఎంపీలు మొదటిసారి ఎన్నికైన వారు... అంటే మొత్తం సభలో దాదాపు 58శాతం అన్నమాట. వీరందరూ పార్లమెంట్ సెషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. రైల్వే బడ్జెట్ మీద జరిగిన చర్చలో 45 మంది సభ్యులు పాల్గొంటే అందులో 27 మంది కొత్తవారే. రెండో రోజు 44 మంది ప్రశ్నలు అడగితే... అందులో 33 మంది కొత్తవారే కావడం విశేషం. బడ్జెట్ సమావేశాలు జరిగిన మొదటివారం కూడా కొత్త సభ్యులు తమ ప్రశ్నలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్త ఎంపీలు పార్లమెంట్ సెషన్స్ లో చురుగ్గా పాల్గొనటం శుభపరిణామమని పార్లమెంట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News